క్రేజీ న్యూస్.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ‘రవితేజ’

-

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద ర్యాంప్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం (జనవరి 27) హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.

సూపర్ హీరోలకు సంబంధించి తను 10కి పైగా సినిమాలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాటిక్ యూనివర్స్లోని తొలి ప్రయత్నమే హనుమాన్ ఈ సినిమాలో కోటి (కోతి పాత్ర పేరు) పాత్రకు మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రవితేజ ఒప్పుకుంటే ఆయనతో సినిమా చేయాలని ఉందని ప్రశాంత్ ఈ ఈవెంట్లో తన మనసులోని మాట బయటపెట్టాడు.

‘ఫిల్మ్ ఇండస్ట్రీలో రవితేజలా సపోర్ట్ చేసేవాళ్లు చాలా తక్కువ. ఇక మా సినిమాటిక్ యూనివర్స్లో కోటి పాత్రను ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఓ ఐడియా వచ్చింది. రవితేజ ఒప్పుకుంటే కోటి క్యారెక్టర్తో సినిమా చేయాలని అనుకుంటున్నా’ అని ప్రశాంత్ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version