రవితేజ ని తమన్నా తన అందాలతో ఆదుకుంటుందా …?

-

తమన్నా భాటియా… మన టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు దాదాపు ఇప్పటి వరకు తను చేసిన హీరోలందరి తోను హిట్స్ అందుకుంది. అందం, అభినయం తమన్నా లో ఉన్న గొప్ప క్వాలిటీస్. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఈ బ్యూటి కాంట్రవర్సీలకి పోకపోవడం కూడా గొప్ప విషయం. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ దగ్గర నుండి దర్శక ధీరుడు రాజమౌళి వరకు అందరు మెచ్చిన హీరోయిన్ కావడం ఆసక్తికరమైన విషయం. అంతేకాదు మెగా హీరోలైన రాం చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ ఇలా టాప్ స్టార్స్ తో నటించిన ఘనత కూడా తమన్నా సొంతం. అంతేకాదు ఈ మెగా హీరోలతో నటించిన సినిమాలన్ని సూపర్ హిట్స్ ని అందుకున్నాయి.

 

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలోను తమన్న తన సత్తా చూపింది. ఇక ప్రస్తుతం సీటిమార్, బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ కి అఫీషియల్ రీ మేక్ దటీజ్ మహాలక్ష్మి సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో దటీజ్ మహాలక్ష్మీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాల తో పాటు తమన్నా మరో సినిమాకి కమిటయిందని లేటెస్ట్ న్యూ. మాస్ మహారాజ్ రవితేజతో గతంలో ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించింది తమన్నా. సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కించాడు. రవితేజ-తమన్నా-సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మాస్ రాజా నెక్స్ట్ సినిమాను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడని ఫ్రెష్ అప్‌డేట్. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో చిత్ర బృందం వెల్లడించనున్నారట. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ కి తమన్నా గ్లామర్ తోడై హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version