క‌థ నచ్చితే మ‌ల్టీస్టార‌ర్ సినిమా కు సిద్ధం : బాల‌కృష్ణ‌

బోయపాటి శ్రీ‌ను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఖండ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డం తో బాల‌కృష్ణ సెల‌బ్రెష‌న్ మూడ్ లో ఉన్నాడు. తాజా గా ఈ రోజు అఖండ చిత్ర బృందం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌యవాడ ఇంద్ర‌కిలాద్రి అమ్మ వారిని ద‌ర్శించుకుంది. ఈ సంద‌ర్భం గా హీరో బాల‌కృష్ణ ఆస‌క్తి క‌ర‌మైన కామెంట్స్ చేశాడు. త‌న‌కు క‌థ నచ్చితే మ‌ల్టీ స్టార‌ర్ సినిమా చేయ‌డానికి సిద్ధం గా ఉన్నాన‌ని ప్ర‌కటించాడు.

దీంతో మెగాస్టార్ చిరంజీవి, న‌టసింహం బాల‌కృష్ణ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా కు సంబంధించిన రూమ‌ర్స్ ఇంకా పెరిగి పోయాయి. గ‌తం లో ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సినిమా చేస్తున్నార‌నే వార్త లు ఎక్కువ గా వ‌చ్చాయి. కానీ దీని పై చిరంజీవి కానీ బాల‌య్య కానీ మైత్రీ మూవీ మేక‌ర్స్ అధికారికంగా స్పందించ‌లేదు. కాగ తాజా గా హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌ల తో ఈ వార్త మ‌ళ్లీ తెర పై కి వ‌చ్చింది.