రీల్ స్టోరిలోనే రియల్ లవ్ స్టోరీస్ షూరూఅవుతాయ్.. కానీ!

-

సీనిమావాళ్ల ప్రేమకథలన్నీ వాళ్లు నటించిన సినిమాల ద్వారానే మొదలవుతుంటాయి. వీటికి ఉదాహరణలు అన్ని టాలివుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఉన్నాయి. వీటికేం రేఖ, అమితాబ్ లూ మినహాయింపేం కాదు. ‘దో అన్‌జానే’(1976) సినిమాతో వీళ్ల పరిచయం మొదలైంది. అప్పటి వరకూ అమితాబ్ బచ్చన్ రేఖకు దీదీబాయి భర్తగానే తెలుసుట!

amitab
amitab

ఆ సిమినా సెట్ మీద అతను ఆమెనెంత ఆకర్షించాడో ఆమే అతణ్ణంతే సమ్మోహనపరచింది. ఆ సినిమా పూర్తయ్యేసరికి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం..కానీ ఈ విషయం బయటపడకుండా ఈ ప్రేమజంట చాలా జాగ్రత్తపడేదట. రేఖ స్నేహితురాలి బంగ్లాలో కలుసుకునేవాళ్లు. అలా దాదాపు రెండేళ్లు గుట్టుగానే ఈ లవ్ స్టోరీ సాగింది. 1978లో ‘గంగా కీ సౌగంద్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించనారంభించాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు. ఇదంతా గమనించిన అమితాబ్‌ ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్‌ రియాక్షన్‌కి అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.

ఆ రూమర్‌ నిజమే అన్న అనుమానాన్ని కలిగించింది రేఖ. నితూ, రిషి కపూర్‌ పెళ్లిలో. పాపిట్లో కుంకుమ దిద్దుకుని, మెడలో మంగళ సూత్రం వేసుకొని ఆ శుభకార్యానికి రేఖ హాజరైంది. ఆమెను చూసివారంతా నిర్ఘాంతపోయారు. అదేమీ పట్టించుకోని రేఖ. సతీసమేతంగా వచ్చిన అమితాబ్‌ బచ్చన్‌ దగ్గరకు వెళ్లి అతని పక్కన నిలబడి మాట్లాడసాగింది. జయకూడా కొంచెం షాకైందట.

సిల్‌సిలా’ స్క్రిప్ట్‌ పట్టుకొని ఇటు రేఖను, అటు అమితాబ్‌ దంపతులనూ కలిశాడు దర్శకుడు యశ్‌ చోప్రా. ఆశ్చర్యంగా ఆ సినిమాకు  ముగ్గురూ ఒప్పుకున్నారు. ఒక రకంగా అది ఆ ముగ్గురి జీవితమే. కథగా తెర మీద ఆడింది. అంతే.. ‘సిల్‌సిలా’ టైమ్‌లో హ్యాంగర్‌కు వేళ్లాడుతున్నట్టుండేది నా పరిస్థితి అని యశ్ చోప్రా ఓ టీవీ ఇంటర్వూలో చెప్పాడు. ఆ సినిమాలోనూ జయ అమితాబ్‌ భార్య, రేఖ అతని ప్రియురాలు. ఈ సినిమాతోనే వీరద్దరి మధ్య ప్రేమ సంబంధం బయటపడనట్లైంది. కానీ సినిమా రీలైజ్ అయిన తరువాత రేఖ, అమితాబ్ ప్రేమ తగ్గుతూ వచ్చిందనే వార్తలూ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news