2021 సంవత్సరానికి గాను ప్రపంచంలోని టాప్ 100 సిటీల్లో ఢిల్లీ చోటు దక్కించుకుంది. ఢిల్లీకి ఆ జాబితాలో 62వ ర్యాంక్ వచ్చింది. గతేడాది ఢిల్లీ ఇదే జాబితాలో 81వ స్థానంలో నిలవగా ఇప్పుడు కొంత ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని 62వ స్థానంలో నిలవడం విశేషం. కాగా వాంకోవర్‌కు చెందిన రెసొనన్స్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఈ జాబితాను విడుదల చేసింది.
సదరు కన్సల్టెన్సీ ఏటా ప్రపంచంలోని అన్ని నగరాల్లోనూ అందుబాటులో ఉన్న సేవలు, ప్రజల జీవన ప్రమాణాలు, పారిశ్రామికీకరణ, టూరిజం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే అందులో ఢిల్లీకి వరుసగా 2వ ఏడాది చోటు దక్కడం విశేషం. ఇక ఆ జాబితా ప్రకారం వరల్డ్ టాప్ 10 బెస్ట్ సిటీల వివరాలు ఇలా ఉన్నాయి.
1. లండన్
2. న్యూయార్క్
3. ప్యారిస్
4. మాస్కో
5. టోక్యో
6. దుబాయ్
7. సింగపూర్
8. బార్సిలోనా
9. లాస్ ఏంజల్స్
10. మాడ్రిడ్
ఇక ఇవేకాకుండా శాన్ ఫ్రాన్సిస్కో, ఆమ్‌స్టర్ డ్యామ్, రోమ్, వాషింగ్టన్ డీసీ, అబుధాబి, టొరంటో, ప్రాగ్, సెయింట్ పీటర్స్‌బర్గ్ తదితర నగరాలు కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇక ఢిల్లీ ఈ ఘనత సాధించడం పట్ల ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీవాలాలకు ఇది గుడ్ న్యూస్ అన్నారు. ఇందుకు గాను 6 ఏళ్ల నుంచి ఢిల్లీ ప్రజలు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఢిల్లీలో ఏర్పడుతున్న పాజిటివ్ మార్పులను ప్రపంచం గమనిస్తుందన్నారు.