శింబులో వ‌చ్చిన మార్పుకు కార‌ణం ఎవ‌రు?

హీరోయిన్‌ల‌తో వ‌రుస ప్రేమాయ‌ణాల‌తో ద‌క్షిణాదిలో సంచల‌‌నం సృష్టించాడు యంగ్ హీరో శింబు. టాలెంటెడ్ యాక్ట‌ర్‌గా చిన్న త‌నం నుంచే ప్రూవ్ చేసుకున్న శింబు `మ‌న్మ‌థ‌`, వ‌ల్ల‌భ చిత్రాల‌తో హీరోగా త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. స్టార్ హీరోగా ఎదిగే క్ర‌మంలో హీరోయిన్‌ల‌తో ప్రేమ‌లో ప‌డ‌టంతో అత‌ని కెరీర్ ఒక్క‌సారిగా గాడి త‌ప్పింది.

తెలుగులోనూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న శింబు బ్రేక‌ప్‌ల త‌రువాత నుంచి బ‌రువు పెర‌గ‌డం మొద‌లుపెట్టాడు. కెరీర్ ప‌ట్ల ఆస‌క్తీ త‌గ్గిపోయింది. 101 కేజీల వ‌ర‌కు బ‌రువు పెరిగిపోయాడు. తాజాగా అత‌నిలో మార్పు మొద‌లైంది. 101 కేజీల బ‌రువు నుంచి ఏకంగా 30 కేజీలు త‌గ్గి 70 కేజీల‌కు త‌గ్గిపోయాడు. స్లిమ్‌గా ఫిట్‌గా మారిన శింబు ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. శింబులో వ‌చ్చిన మార్పు గురించి అత‌ని సోద‌రి టిఆర్ ఎల‌క్కియా అభిలాష్ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది.

`ఈ పరివర్తన కోసం తను చాలా కష్టపడ్డాడు. బరువు తగ్గడానికి మాత్రమే త‌ను శ్ర‌మించ‌లేదు. త‌న‌ నిజమైన త‌న‌ని తాను ప‌సొంద‌డం కోసం చేసిన ప్ర‌య‌త్న‌మిది. ఈ ప్రయాణంలో నేను అతనితో కొన్ని రోజులు ఉన్నాను. అతను తన లక్ష్యాల కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు నేను గ‌మ‌నించాను. ఈ విష‌యంలో అన్న‌య్య విల్ ప‌వ‌ర్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నాను` అని టిఆర్ ఎల‌క్కియా అభిలాష్ తెలిపింది. ఉన్న‌ట్టుండి శింబులో మార్పుకు కార‌ణం ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారంది.