సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార వయస్సు మూడున్నర పదులు దాటేసినా కూడా ఇప్పటకీ ఆమె సినిమా వస్తుందంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్‌లో ఆమె సినిమా చేయాలంటే ఇప్పుడు అందుకుంటోన్న రెమ్యునరేషన్ రు. 4 కోట్ల పైమాటే అంటున్నారు. ఇక అడపాదడపా తెలుగులో కూడా ఆమె సినిమాలు చేస్తోంది. ఇక శింబు, ఆర్య లాంటి హీరోలతో ఆమె ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రభుదేవాతో ఆమె వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
ఇక ఎట్టకేలకు నయనతారకి ఫైనల్‍గా దర్శకుడు విఘ్షేష్ శివన్‌ను ముగ్గులోకి దింపింది. వీరిద్దరు గత మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నా విఘ్నేష్ పెళ్లికి తహతహలాడుతున్నా కూడా నయన్ మాత్రం పెళ్లికి సుముఖత వ్యక్తం చేయడం లేదన్న ప్రచారం ఉంది. ఇన్నేళ్ల పాటు ఆమె రిలేషన్‌లో ఉన్నా పెళ్లికి ఓకే చెప్పకపోవడానికి కారణం… పెళ్లితో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిపోతుందన్న భయమే అట.
ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఇలాంటి టైమ్‍లో పెళ్లి చేసుకుంటే ఇక తనకి ఈ స్థాయిలో అవకాశాలు రావని నయనతారకు తెలుసు. సమంత కూడా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఎప్పుడు అయితే పెళ్లయ్యిందో ఆ తర్వాత ఆమె కెరీర్ కుంటుపడింది. ఇప్పడు ఆమె గ్లామర్ పాత్రలు వేయడం లేదు. కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితమవుతోంది. అందుకే పెద్ద సినిమాల్లో ఆమెకు ఛాన్సులు లేవు. ఇప్పుడు ఆ తప్పు తాను చేయకూడదనే నయన్ సహజీవనాన్ని ఓ వైపు ఎంచక్కా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తోందన్నది కోలీవుడ్ గుసగుస.