ఎన్టీఆర్ అమెరికా నుండి వెంటనే తిరిగి రావడానికి కారణం..?

తాజాగా మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం మొత్తం హాజరయ్యి సందడి చేసింది. ఇకపోతే ఇంకా ఆర్ఆర్ఆర్ టీం హైదరాబాద్ కి తిరిగే రాలేదు.. కానీ ఎన్టీఆర్ మాత్రం అప్పుడే హైదరాబాద్లో సందడి చేస్తున్నారు.. తెల్లవారుజామున హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఎన్టీఆర్ కి ఆయన అభిమానులు పూర్తిస్థాయిలో ఘన స్వాగతం పలికారు. హాలీవుడ్ ప్రముఖులతో ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆస్కార్ వేడుకకు వెళ్లి వచ్చిన తెలుగు స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా నిలిచారు. అందుకే ఎన్టీఆర్ విషయంలో తెలుగు ప్రేక్షకులే కాదు వారి అభిమానులు సినీ ప్రముఖులంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు.

ఇకపోతే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా అమెరికాలోనే ఇంకా ఎంజాయ్ చేస్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం అప్పుడే హైదరాబాద్ కి ఎందుకు తిరుగు వచ్చారు అనేది ప్రస్తుతం ఇప్పుడు అనుమానంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను ప్రారంభించాల్సి ఉంది. అందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయడానికి.. ఆయన ఈ సినిమా కోసం ఫోటోషూట్ నిర్వహించనున్నారు. అందుకే ముందుగానే హైదరాబాదులో ల్యాండ్ అయ్యాడని సమాచారం.

ఇకపోతే మరోవైపు రామ్ చరణ్ కి సినిమా షూటింగ్ లు ఇలా లేవు కాబట్టి.. ఇప్పుడు అక్కడ ఆయన తన భార్యతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రాజమౌళి, కీరవాణి కూడా త్వరలోనే అమెరికా నుండి ఇండియాకి రాబోతున్నారు.