లేడీ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన రెబ‌ల్ స్టార్‌.. రిస్క్ చేస్తున్న ప్ర‌భాస్‌!

-

ఇండియ‌న్ సినిమాలో స్టార్‌గా ఎదిగాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. టాలీవుడ్ నుంచి నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన ఏకైక హీరో ఈయ‌నే. బాహుబ‌లితో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఆర‌డుగుల క‌టౌట్‌తో అమ్మాయిల్లో ఎవ‌రికీ లేనంత ఫాలోయింగ్ మ‌నోడికే ఉంది. మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గా బీటౌన్ హీరోయిన్ల‌ను కూడా త‌న‌ను ఫాలో అయ్యేలా చేశాడు.

ఇక బాహుబ‌లి త‌ర్వాత వ‌రుస‌గా ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ షూటింగ్ జ‌రుగుతుండ‌గానే ఆదిపురుష్‌, స‌లార్ సినిమాల‌ను ప‌ట్టాలెక్కించాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాల‌కు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక క‌రోనాతో సినిమాల షూటింగులు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి.

దీంతో దొరికిన ఈ గ్యాప్‌లో మ‌రో సినిమాను లైన్ పెడుతున్నాడు మ‌న రెబ‌ల్ స్టార్‌. వ‌రుస‌గా క‌థ‌లు వింటున్నాడు. అయితే ఓ లేడీ డైరెక్ట‌ర్‌కు త‌న 25వ సినిమా కోసం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న లేడీ డైరెక్ట‌ర్‌తో చేయ‌లేదు. నేష‌నల్ స్టార్‌గా ఆయ‌న‌కున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌గా సినిమాలు ప్లాన్ చేస్తున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు త‌మిళంలో సూర్య‌తో హిట్ కొట్టిన డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడంట‌. మ‌రి ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అప్‌డేట్ వ‌స్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news