బ్రేకింగ్: ముంబైలో మరో ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య

-

సినీ పరిశ్రమతో పాటుగా పలు రంగాల్లో ఆత్మహత్య కేసులు పెరుగుతూ ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తర్వాత కొన్ని ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ కళాకారుడు రామ్ ఇంద్రానిల్ కామత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 19 న మాతుంగాలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు మీడియాకు వెల్లడించారు.

ఆయన ఇంట్లో సూసైడ్ నోట్ కూడా దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. మాతుంగా పోలీసులు ఆత్మహత్యతో పాటు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆయన ఆత్మహత్యకు సంబంధించి ఇంకా ఏ విధమైన క్లూ దొరకలేదు అని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నామని, కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news