ఓ వ్యాపారి కరోనా లాంటి కష్ట సమయంలో కూడా సరి కొత్త ప్రకటనను ఇచ్చాడు.కేరళలోని తిరువనంతపురంలో ఓ ఎలక్ట్రానిక్ స్టోర్ కరోనా ను ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదించాలని చూస్తుంది.
తమ షాపులో వస్తువు కొనుగోలు చేసిన 24 గంటల్లోపు కరోనా పాజిటివ్‌గా తేలినవారికి జీఎస్టీ లేకుండా రూ .50 వేల క్యాష్‌ప్రైజ్ ఇస్తామని విస్తృతంగా ప్రచారం చేసింది.ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు ఉంటుంది అని పేర్కొన్నారు. కొట్టాయంలోని పాల మున్సిపాలిటీ కౌన్సిలర్, న్యాయవాది పులిక్కక్కందం మండిపడ్డాడు.ఇది చట్టవిరుద్ధం, శిక్షార్హమని పేర్కొంటూ రాష్ట్ర సీఎంకు ఆయన లేఖ రాశారు.
డబ్బు కోసం కరోనా వైరస్‌బారినపడిన వ్యక్తి వ్యాధి దాచిపెట్టి షాప్ కు వచ్చేలా ఉందని లేఖలో తెలిపారు.ఈ ప్రకటన కరోనాను ఉద్దేశపూర్వకంగా వ్యాప్తిచేయాలనేదానిగా పరిగణించాల్సి వస్తుందన్నారు.కేరళ మునిసిపాలిటీ యాక్ట్ ఆరోగ్య నిబంధనల ప్రకారం వారు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు అని పులిక్కక్కండం లేఖలో వివరించారు.ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియజేయడంతో పోలీసులు రిటైల్ దుకాణాన్ని మూసివేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణను కూడా ప్రారంభించారు.