మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా కు రెడీ అవుతున్న రెజీనా

టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా లేడీ ఓరియెంటెడ్ సినిమా ల వైపు మొగ్గు చూపుతుంది. రెజీనా వ‌రుస గా రెండో లేడీ ఓరియెంటెడ్ క‌థ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అదే బ్రేకింగ్ న్యూస్ అనే సినిమా కు ఇటీవ‌ల రెజీనా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అంతే కాకుండ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఈ సినిమా లో రెజీనా కసాండ్ర తో పాటు సుబ్బ రాజు, జేడీ చక్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర ల లో క‌నిపించ నున్నారు. అలాగే ఈ సినిమా కు సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగ హీరోయిన్ రెజీనా క‌సాండ్ర ప్ర‌స్తుతం మ‌రో హీరోయిన్ నివేథా థామ‌స్ తో క‌లిసి శాకినీ డాకిని అనే యాక్ష‌న్ సినిమా లో న‌టిస్తున్నారు. అలాగే రెజీనా కసాండ్ర లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టిస్తుంది. కాగ ప్ర‌స్తుతం చాలా మంది హీరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ క‌థ ల వైపే మొగ్గు చూపుతున్నారు. సినిమా అయిన వెబ్ సిరీస్ అయిన ప‌ర్వాలేద‌ని లేడీ ఓరియెంటెడ్ క‌థ ల నే ఎంచుకుంటున్నారు.