ఫేస్ బుక్ లో పరిచయం…పెళ్ళంటూ ఎర…!

ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలు నేరాలు ఘోరాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా సత్తుపల్లికి చెందిన దాసు అనే వ్యక్తి బీటెక్ చదివి హైదరబాద్ లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో అతడు ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడు. కొద్దిరోజులకు రమ్మీకి బానిసై ఉద్యోగానికి వెళ్లకపోవడం తో ఉద్యోగం నుండి తొలగించారు.

Cheating case Hyderabad
Cheating case Hyderabad

ఇక 2017లో దాసు జ్యోతి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం పోయిన తర్వాత వీరు సత్తుపల్లి కి మకాం మార్చారు. కాగా దాసు ఫేస్ బుక్ లో కల్యాణి పేరుతో అకౌంట్ తెరచి యువకులకు వల విసరడం ప్రారంభించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమ పెళ్లి పేరుతో చాటింగ్ చేశాడు. ఇక దాసు భార్య జ్యోతి కల్యాణి పేరుతో మాట్లాడుతూ కవర్ చేసింది. అలా ఈ జంట బాధితుడి నుండి కోటి వసూలు చేసి జల్సాలు చేశారు. మోసపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో దాసు భాగోతం బయటపడింది.