క‌రోనా ప‌రిస్థితుల‌పై రేణూదేశాయ్ కామెంట్లు.. ఇది క‌దా బాధ్య‌త అంటే!

క‌రోనాతో దేశం ఎంత‌లా అత‌లాకుత‌లం అవుతందో చూస్తూనే ఉన్నాం. ఓ వైపు బెడ్లు దొర‌క్క‌, ఆక్సిజ‌న్ అంద‌క ఎంత మంది చ‌నిపోతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి టైమ్ లో ప‌లువురు సెల‌బ్రిటీలు పోస్టులు పెడుతూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. మ‌రి కొంద‌రు ముందుకు వ‌చ్చి చాలా మందికి సాయం చేస్తున్నారు. రీసెంట్ గా చాలా మంది హీరోలు, ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో రేణూ దేశాయ్ పెట్టిన పోస్టు వైర‌ల్ గా మారింది.


ఆమె ఇలా రాసుకొచ్చారు.. ‘‘బాధలు ద్వేషం లాంటివి మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కేవలం బాధపడటానికే ఈ శరీరం లేదు కదా? బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందంగా గ‌డ‌పాలి. ఇదే మ‌న జీవితం మనం ఇప్పుడు చావు-బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏది అవసరమో అది చేయాలి’’ అంటూ క‌రోనా ప‌రిస్థితుల‌ను ఉద్ధేశించి ఆమె రాసుకొచ్చారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై తీవ్ర ఆందోళ‌న తెలిపారు.

అంతే కాక‌.. ‘‘సంతోషంగా ఉండడానికి స్టాండప్ కామెడీ వీడియోలు చూడండి.. క్యూట్ పప్పీల వీడియోస్ చూడండి. ఈ క్లిష్ట‌మైన కాలం ఎక్కువ రోజులు ఉండదు. వెళ్లిపోతుంది.. పోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పతనం. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి’’ అంటూ జాగ్ర‌త్త‌లు చెప్పింది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా మెసేజ్ ఇచ్చిందంటూ మెగా అభిమాన‌లు తెగ సంబుర ప‌డిపోతున్నారు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.