SBI డెబిట్‌ కార్డు ఉంటే రూ.2 లక్షల వరకు ప్రయోజనం…!

-

మీకు ఎస్బీఐ లో ఖాతా ఉందా..? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. దీని వలన మంచి లాభాలు ఉంటాయి. అయితే ఎన్నో స్కీమ్స్ కూడా వున్నాయి. ఇవి నిజంగా కస్టమర్స్ కి చాల ఉపయోగం. ఇది ఇలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల డెబిట్ కార్డులు అందిస్తోంది.

వీటిల్లో ఎస్‌బీఐ రూపే జన్‌ధన్‌ కార్డు కూడా ఒకటి. ఈ కార్డు ఉన్న వారికి ఒక బెనిఫిట్‌ ఉంది. అయితే అది ఏమిటంటే..? ఇన్సూరెన్స్ కవరేజ్‌. ఈ కార్డు వున్నా వాళ్లకి ఉచితంగానే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది. జన్‌ ధన్‌ ఖాతాను జీరో బ్యాలెన్స్‌ ఖాతా అని కూడా చెప్పవచ్చు. అంటే ఇందులో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

పైగా ఎలాంటి చార్జెస్ కూడా పడవు. మీరు కూడా జన్‌ ధన్‌ ఖాతాను జీరో బ్యాలెన్స్‌ ఖాతా ఓపెన్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే దీని కోసం మీరు దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి జన్‌ ధన్‌ ఖాతా తెరవచచ్చు. ఐడీ ఫ్రూప్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, ఫోటోలు ఇచ్చి ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు.

కేవలం ఇన్సూరెన్స్ ఏ కాదు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. నిరుపేదలకు లాభం కలగాలని కేంద్రం జన్‌ ధన్‌ ఖాతా ద్వారా ఈ ప్రయోజనాలను అందిస్తోంది. చాల మాది ఇప్పటికే ఈ ఖాతాని ఓపెన్ చేసారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news