అందం అమ్మాయి అయితే రెష్మీ గౌత‌మ్ లా ఉంటుందా!

చూడ‌ప్పా సుధీర్ అప్పా.. నేను రెష్మీగౌత‌మ్ జ‌బ‌ర్ద‌స్త్ లో ఉంటా.. ఢీలోనూ ఉంటా అంటూ ర‌చ్చ చేసే రెష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ భామ యాంక‌రింగ్ తోనే కాకుండా త‌న న‌ట‌న‌తో ఎంతో మందిప్రేక్ష‌కుల‌ను సంపాదించుకుంది. త‌న అందం, అభినయంతో కుర్ర‌కారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రెష్మీ కోస‌మే ఆమె షోలు, ప్రోగ్రామ్ లు చూసే వాళ్లు ఉంటారు.


ఇక రెష్మీ, సుధీర్ బుల్లితెర‌పై చేసే మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వీరి కోస‌మే ఢీ షో చూసేవాళ్లు ఉంటారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని ఇప్ప‌టికే ఎన్నో పుకార్లు షికారు చేశాయి. కానీ అవేమీ లేవంటూ.. తాము మంచి ఫ్రెండ్స్ అని వీరిద్ద‌రూ ఎన్నో ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. ఇక ఢీ షోలో వీరి కోస‌మే కొన్ని స‌న్నివేశాల‌ను క్రియేట్ చేస్తారు. వీరి డ్యాన్స్ ను ప్రోమోల‌లో రిలీజ్ చేస్తారంటే ఈ జంట‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి.


ఇక అప్పుడ‌ప్పుడు సినిమాలు చేసే ర‌ష్మీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటెస్టు ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. కైపెక్కించే క‌త్తి లాంటి ఫొటోలు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక ఈ పిల్ల రీసెంట్ గా పోస్టు చేసిన ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. మ‌త్తు లాంటి చూపుల‌తో మాయ చేస్తున్నాయి. ఇక ఆ ఫొటోల‌ను మీరూ చూసేయండి