మీరు చెప్పే విషయం ఆకట్టుకునేది కాకపోయినా మీరు చెప్తున్న విధానం బాగున్నట్టయితే ఖచ్చితంగా వినేవాళ్ళు ఉంటారు. ఇది మీ వ్యక్తిత్వానికీ వర్తిస్తుంది. ఇక్కడ మీరు ఎలా ఉన్నా అంటే, అందంగా ఉన్నారా అన్న దానికంటే మీ వ్యక్తిత్వం బాగుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు ఉంటారు. సమాజంలో అయినా వ్యాపారంలో అయినా మనం చెప్పేది అవతలి వారికి నచ్చితేనే డీల్ కుదురుతుంది. ఆ డీల్ కుదరాలంటే మీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వినడం నేర్చుకోండి
అవతలి చెబుతున్నది వినే ఓపిక ఉండాలి. మీరు చెబుతూ పోతుండే కన్నా అవతలి వారు ఏం చెబుతున్నారో కరెక్ట్ గా అర్థం అయితే వారితో ఎలా ఉండాలనేది తెలుస్తుంది.
జడ్జ్ చేయకండి
విన్న విషయాలను ఆధారంగా చేసుకుని జడ్జ్ మెంట్ ఇవ్వవద్దు. కాయిన్ కి ఒకవైపే విన్న మీరు రెండవ వైపు ఏముందో తెలుసుకోకుండా తీర్పులు ఇవ్వవద్దు. ఇతరులని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు.
ఉల్లాసంగా ఉండండి
ఉల్లాసంగా ఉండే వారితోనే మాటలు కలపడానికి ఇష్టపడతారు. ఏదో కోల్పోయినట్టు కూర్చుంటే ఏ పనీ అవ్వదు. మీలో ఉల్లాసం ఉరకలెత్తాలి. అది ఎదిటివారిని ఆకర్షించడంలో సాయపడుతుంది.
మొదటి ఇంప్రెషన్
మొదటిసారి కలిసినపుడు నవ్వుతూ పలకరించడం నేర్చుకోండి. మీ పెదాలపై కనిపించే నవ్వు అవతలి వారి పెదాలపై నవ్వుని వికసించేలా చేస్తుంది.
నమ్మకంగా ఉండండి
మీతో చెప్పిన విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి. మీ మీద నమ్మకంతో ఒక విషయం చెబుతున్నారంటే అది మిమ్మల్ని దాటిపోదనే వారి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకోండి.
పాజిటివ్ గా స్పందించండి
ఎదుటివారిపై నెగెటివ్ కామెంట్లు చేయవద్దు. పాజిటివ్ గా స్పందించండి. పాజిటివ్ గా పలకరించండి. అది మీపై వారికి గౌరవాన్ని పెంచుతుంది.
ఎనర్జీ
ఎప్పుడు చూసిన ఎనర్జీ నిండిన బల్బులా కనబడాలి. గాలి తీసేసిన టైరులా కనిపిస్తే మీరు కూడా వాళ్ళ దగ్గరకి వెళ్ళాలని అనుకోరు.