అల్లు అర్జున్ పై మరోసారి సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రముఖుల భేటీలో అల్లు అర్జున్… రామ్ చరణ్ ల ప్రస్తావన వచ్చిందట. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై మరోసారి సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్…మీద నాకెందుకు కోపం ఉంటుంది..? అని తెలిపారు. అల్లు అర్జున్.. రామ్ చరణ్ ఇద్దరు నాకు చిన్నప్పటి నుండి తెలుసు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాతో కలిసి తిరిగారని వివరించారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా… చట్టం ప్రకారం వ్యవహరించాలి అనేది నా విధానం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
హీరోలకు రేవంత్ షాక్ ఇచ్చారు..బౌన్సర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి…అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు ఇస్తామని… దీనిపై కమిటీ వేయనున్నట్లు సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.