డైట్: ఎక్కువ తినాలన్న కోరికను అదుపు చేసుకోవడానికి ఇలా చేయండి

-

ఒక్కో మనిషికి ఒక్కో ఇష్టం ఉంటుంది. కొందరికి కార్లు అంటే ఇష్టం, కొందరికి స్టైలిష్ గా కనిపించడం అంటే ఇష్టం, ఇంకొందరికి ఫుడ్ అంటే ఇష్టం.

ఫుడ్ ఇష్టం ఉండడం వల్ల అతిగా తినేస్తారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. శరీరాకృతి దెబ్బతింటుంది. లావుగా మారిపోవడం వల్ల యాక్టివ్ గా ఉండలేక పోతారు.

మరి, ఎక్కువగా తినే అలవాటును ఎలా మానుకోవాలి? దీనికోసం కొన్ని టిప్స్ పనిచేస్తాయి.

కావలసినన్ని నీళ్లు తాగండి:

చాలాసార్లు దాహం ఎక్కువగా వేస్తుంటే ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మీ పక్కన ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోండి. కావాల్సినన్ని నీళ్లు తాగండి.

ప్లానింగ్ ముఖ్యం:

ఒక రోజులో ఏం తినాలి? ఏ సమయాల్లో తినాలనేది ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారమే మీరు వెళ్ళండి. ఆ ప్లానింగ్ లో స్నాక్స్ కూడా చేర్చుకోండి. ఫుడ్ అంటే ఇష్టం ఉండేవారు స్నాక్స్ ని ఈజీగా వదిలిపెట్టలేరు. ప్లానింగ్ లో ఉన్న ప్రకారమే స్నాక్స్ తినండి. అంతకంటే ఎక్కువగా అస్సలు తినవద్దు.

చిన్న ప్లేట్స్ వాడండి:

చిన్న ప్లేట్స్ వాడటం వల్ల మీరు భోజనం తక్కువ వడ్డించుకున్నా సరే ప్లేట్ లో ఎక్కువగా కనిపిస్తుంది. మానసికంగా మీకు ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే తొందరగా మీరు మీ ప్లేట్స్ మార్చేయండి.

ఆకలి నుండి కాదు తినాలన్న కోరిక నుండి పారిపోండి:

ఏదైనా ఫుడ్ చూసినప్పుడు మీకు తినాలనిపిస్తే వెంటనే మీ మూడ్ ని వేరే దాని మీదకు మరల్చండి. ఇది కచ్చితంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news