ఆర్ఆర్ఆర్ నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు ఇక జాతరే

ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు గుడ్ న్యూస్ ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ అయింది. revolt of BHEEM అనే పేరుతో చిత్ర బృందం తాజా గా విడుద‌ల చేసింది. కొముర‌మ్ భీముడో అంటూ అని సాగే ఈ పాట ఆక‌ట్టుకుంటుంది. ఈ పాటను చూస్తే గుస్బామ్స్ రావ‌డం ఖాయం. అంతాలా ఈ పాట ఆక‌ట్టుకుంటుంది. దీంతో తారక్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ పాటలో తార‌క్ ఎక్స్ ప్రెష‌న్స్ పీక్స్ లో ఉన్నాయి. అలాగే పాట లిరిక్స్ తో పాటు కీర‌వాణి మ్యూజిక్ కూడా అద్భ‌తంగా ఉంది. ఈ పాటతో ఆర్ఆర్ఆర్ అభిమానుల్లో కొత్త జోష్ వ‌చ్చింది.

అలాగే తార‌క్ ఫ్యాన్స్ పున‌కాలు తెప్పించేలా ఈ సాంగ్ ఉంది. కాగ ఈ సినిమా లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీముడుగా అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అల్లురి సీత‌రామ రాజు పాత్ర‌ల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కాగ ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన అప్ డేట్ ల‌తో ఈ సినిమా పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. తాజా గా విడుద‌ల చేసిన ఈ పాటతో సినిమా అంచ‌నాలు పీక్స్ కు వెళ్లాయి. కాగ ఈ సినిమా ను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7 న పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు.