సంచ‌ల‌న సినిమాతో వ‌స్తున్న ఆర్జీవీ.. ఇది వేరే లెవెల్‌!

-

రామ్ గోపాల్ వ‌ర్మ అంటేనే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఆయ‌న మాట‌ల‌తోనే కాదు సినిమాల‌తో కూడా వివాదాస్ప‌ద‌మ‌వుతుంటారు. ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌న సినిమాలు తీసి త‌న మార్కును చూపించారు. ఇప్పుడు ఓ కొత్త సినిమాతో వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ టాలీవుడ్‌లో తీయ‌ని సినిమాతో సంచ‌ల‌నంగా మారారు.

ఇద్ద‌రు అమ్మాయిలు లెస్బియ‌న్‌గా మారితే ఎలా ఉంటుంద‌నే కొత్త క‌థ‌తో ఆర్జీవీ తీస్తున్నాడు. ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్ప‌టివ‌కే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ అంచ‌నాలు పెంచేశాయి.

మ‌గాళ్ల మీద విర‌క్తి పుట్టిన ఇద్ద‌రు అమ్మాయిలు తామే ల‌వ‌ర్స్ లాగా మారిపోయి రొమాన్స్ చేసుకునే సీన్స్ ఈ సినిమాలో హైలెట్ గా ఉన్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి మ‌ర్డ‌ర్ క్రైమ్‌లో ఎలా ఇరుక్కున్నారు అనే క‌థనే డేంజ‌ర‌స్‌. మ‌రి ఆర్జీవీ తీస్తున్న ఈ సంచ‌ల‌నం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఈ సినిమాను కూడా త‌న స్పార్క్ ఓటీటీలోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఆర్జీవీ ప్ర‌క‌టించాడు. ఇందులో నైనా గంగూలి, అప్స‌రా రాణి లెస్బియ‌న్‌గా క‌నిపించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news