ఈ రోజుల్లో అందరూ ఎల్‌పీజీ సిలిండర్ వాడుతున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ అయిపోగానే.. కొత్త బండ బుక్ చేసుకుంటారు. ఏజెన్సీ బాయ్ సిలిండర్ డెలివరీ చేస్తాడు. అంతే ఇంకేముంది అనుకోకంyì . కేవలం సిలిండర్‌కు ఉండే సీల్‌ను చూసి మోసపోకండి. ఇందులో బరువు తక్కువ వచ్చే సిలిండర్‌లు కూడా ఉంటాయి. గతంలో ఇలా మోసపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే, మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ రాగానే ముందుగా సిలిండర్ బరువు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.
మీరు ఎప్పుడో ఒకసారి అదేంటి ఈసారి గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోంది అని అనుకునే రోజులు కూడా ఉండే ఉంటాయి. అంటే దీనార్థం మీ గ్యాస్ సిలిండర్‌లో తక్కువ గ్యాస్ వచ్చిందని భావించాలి. బరువు చూసుకోవడానికి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. డెలివరీ బాయ్ వద్ద బరువు చూసే మెషీన్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ బరువు 14.2 కేజీలు ఉంటుంది. సిలిండర్ బరువు 15.3 కేజీలు ఉంటుంది. అంటే మొత్తంగా సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉండాలి. కాకుండా మీకు వచ్చిన సిలిండర్ బరువు అసలు బరువు కంటే తక్కువ ఉంటే.. మీరు మీ డెలివరీ బాయ్‌పైనా గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. మీరు సదరు గ్యాస్ డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. 1800 2333 555 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసే అవకాశముంది. ఈ నంబర్ ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని ఇకపై మీకు తక్కువ వెయిట్ ఉన్న సిలిండర్ డెలివరీ అవుతే, ఏమాత్రం వెనుకుడుగు వేయకుండా పై టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. అప్పుడు మోసానికి అడ్డుకట్ట వేయగలుగుతారు.