ప్రస్తుతం నెల్లూరు కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు గురించి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, సీఎం జగన్ కూడా దీనిపై స్పందించారు. ఐసీఎంఆర్ అధికారులు కృష్ణపట్నంకు వచ్చి నమూనాను పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మందుతో త్వరగా కోలుకుంటున్నారనిచెప్తున్నారు.
మరికొందరేమో ఆకుపసరుతో ఆక్సిజన్ లెవల్స్ పెరగడమేంటి? దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరుతున్నారు. ఇలా రెండు రకాలుగా ఆ మందుపై వాదన వినిపిస్తోంది. అయితే తాత్కాళికంగా మందు పంపిణీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది.
ఇదిలా ఉండగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఆనందయ్య మందుపై తనదైన స్టైల్లో సంచలన కామెంట్లు చేశారు. ఆనందయ్య ఇప్పుడు జాతీయ సంపద అని, ఆయనకు మిలిటరీతో భద్రత కల్పించాలని కోరారు. వ్యాక్సిన్ కంపెనీలు ఫార్ములాను చెప్పలేదు గానీ.. ఆనందయ్య మాత్రం ఫార్ములాను చెప్పారని, ఆయన ఫ్రీగా వైద్యం చేస్తున్నందున ఆయనకు నోబెల్ ప్రైజ్ బహుమతి ఇవ్వాలంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.