రోజా.. మల్లెమాల పిలిచి మరీ అవమానించిందా..?

-

సాధారణంగా పాపులర్ టీవీ చానల్స్ పండుగ సీజన్ వచ్చిందంటే చాలు బుల్లితెరపై సరికొత్త వినోద కార్యక్రమాలను ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న దసరా పండుగ కోసం ప్రముఖ చానల్స్ సినీ , బుల్లితెర సెలబ్రిటీలతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఎప్పటిలాగే ఈటీవీ వారు ఈసారి కూడా దసరా వైభవం అనే ప్రోగ్రాం తో ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక చిన్న ప్రోమో ను విడుదల చేయగా ఈ ఈవెంట్ కి ప్రముఖ నటి , జబర్థస్త్ మాజీ జడ్జ్ అలాగే ఏపీ మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేసినట్లు తెలుస్తోంది.. ఇక స్టేజ్ పైకి రోజా రాగానే అందరూ ఉత్సాహంగా ఆమెకు ఆహ్వానం పలికారు.

ఇక ఆ సమయంలోనే హైపర్ ఆది లాంటి కమెడియన్స్ పై రోజా కూడా కొన్ని పంచులు వేశారు . ఇక అలా మొత్తానికి ప్రోమో అంత సరదాగానే సాగింది. ఇక సినీ నటుడు కృష్ణ భగవాన్ కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆటో రాంప్రసాద్ , హైపర్ ఆది ఇద్దరు కూడా కూరగాయల వ్యాపారం చేస్తున్న స్కిట్ తో అందరినీ నవ్వించారు. ఇక ఆ తర్వాత గెటప్ శ్రీను దశావతారం కాన్సెప్ట్ తో ఒక్కో గెటప్ లో అందర్నీ అలరించారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ప్రోమో చివరి దశకు వచ్చేసరికి రోజా ఒక్కసారిగా అందరిపై సీరియస్ అయిపోయింది.

“నన్ను అవమానించడానికి షోకి రమ్మన్నారా? ప్లాన్ చేసుకొని పిలిచారా? అంటూ వెంటనే ఎమోషనల్ అయిపోయి స్టేజ్ నుంచి వెళ్లిపోవడం మనం ప్రోమోలో చూడవచ్చు.. ఇకపోతే ఇలా స్టేజి పైనే తాను భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతోంది. అయితే నిజంగానే రోజా అవమానించారు అని ఎమోషనల్ అయ్యారా ? లేక ఇన్ని రోజులు ఇంతమంది కమెడియన్స్ కి దూరంగా ఉండటం వల్ల ఆనందంతో భావోద్వేగానికి గురి అయ్యారా? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version