పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” షూటింగ్ పూర్తయింది. ఈ వార్తను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి నాలుగో సాంగ్ విడుదలైంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్ పవన్ కల్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కీరవాణి ట్యూన్ అందించారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన గ్లామర్, డాన్స్ మూమెంట్స్ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమా ఈ జూన్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది.