యూఎస్ లో కలెక్షన్ల దుమ్ము రేపుతున్న ట్రిపుల్ ఆర్

-

‘ ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాస్తోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కావడం… ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గన్, అలియా భట్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో సినిమాకు మొదటి నుంచి భారీ హైప్ వచ్చింది. ఈ అంచనా మధ్య మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డుల వేట కొనసాగిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాళం భాషల్లో విడుదలైన ట్రిపుల్ ఆర్ అన్ని ప్రాంతాల్లో రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది.

విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లను గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు యూఎస్ లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది ట్రిపుల్ ఆర్. మూడు రోజుల్లో 9.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. మూవీ రిలీజ్ అయి కేవలం మూడే రోజులు కావడంతో రానున్న రోజుల్లో కలెక్షన్ల ఫిగర్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news