ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

-

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే కిరణ్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే కనీసం ఒక్కసారైనా మూవీ చూసేయచ్చని అభిమానులు భావిస్తుంటారు. కిరణ్ అబ్బవరం లేటెస్ట్​గా నటించిన సినిమా రూల్స్ రంజన్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

- Advertisement -

నేహా శెట్టి హీరోయిన్​గా… రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా .అక్టోబరు 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికగా ఆహాలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ‘రూల్స్‌ రంజన్‌’ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఓటీటీ వేదిక తెలిపింది. ఈ సినిమాను దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించారు. వెన్నెల కిషోర్‌, ఆది కామెడీ మాత్రమే సినిమాను కాస్త నిలబెట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...