ఆరెక్స్ భామకు ఆ ఆఫర్ రాలేదా..!

-

ఆరెక్స్ 100 సినిమాతో యువత మనసులు గెలిచిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఐదారు సినిమాలకు రావాల్సిన క్రేజ్ కాస్త ఒక్క సినిమాతో రాబట్టుకుంది. ఇక ఆమెతో సినిమా అంటే దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సి కళ్యాణ్ నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న పాయల్ రాజ్ పుత్ కింగ్ నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసిందని అన్నారు.

నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన మన్మధుడు సీక్వల్ లో అనుష్కతో పాటుగా పాయల్ రాజ్ పుత్ ను సెలెక్ట్ చేశారని టాక్. చిలసౌ డైరక్టర్ రాహుల్ రవింద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి పాయల్ రాజ్ పుత్ నోరి విప్పింది. అసలు ఆ సినిమా నుండి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని. సీనియర్ స్టార్స్ తో నటించేందుకు సిద్ధమే అని చెబుతుంది పాయల్. ఇక లేటెస్ట్ గా వెంకీ మామా సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ పేరు పరిణీలణలో ఉందట. నాగ చైతన్య కూడా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news