వరద బాధితులకు సాయి ధరమ్‌ తేజ్‌ భరోసా..రూ. 2 లక్షల చెక్‌ ఇచ్చి !

-

వరద బాధితులకు సాయి ధరమ్‌ తేజ్‌ భరోసా ఇచ్చారు. విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను పరామర్శించిన సినీ నటుడు సాయి ధరంతేజ్… అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం రు.2 లక్షలు చెక్ ఇచ్చిన సాయి తేజ్ అనంతరం మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడకు వచ్చానని… వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమును దర్శించుకుని ప్రార్థించానని తెలిపారు.

Sai Dharam Tej assurance to flood victims

నా వంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నానని.. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ స్పందన బాగుందని వెల్లడించారు. ప్రభుత్వం తగు రీతిలో స్పందిస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్న…కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంతో నాకు విడదీయరాని బంధం ఉందని తెలిపారు. నాకు ప్రమాదం జరిగినప్పుడు నేను త్వరగా కోలుకోవాలని వృద్ధులంతా ప్రార్థనలు చేశారని వివరించారు. వృద్ధాశ్రమం అభివృద్ధికి సైతం నేను సహకరించానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news