మామ పార్టీలోకి వెళ్ళనున్న సాయి ధరమ్ తేజ్.. క్లారిటీ ఇదే..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఈసారి ఎలాగైనా సరే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమాలలో నటిస్తూనే ఆ డబ్బులతో రాజకీయాలలో సెరవేగంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పాపులారిటీ ఉన్న సినీ యాక్టర్స్ ని కూడా ఆయన తన పార్టీలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కూడా రాబోతున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. ఈరోజు ఈ సినిమా విడుదల అయింది. మొదటి షో తో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి ధరంతేజ్ తన మామ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలోకి వెళ్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ .. తనకు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదు అని.. తనకు తెలిసింది కేవలం సినిమాలు, క్రికెట్ మాత్రమే అని.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కార్యకర్తగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని.. ఇంట్రెస్ట్ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని పవన్ సూచించాడని.. రెండు పడవలపై ప్రయాణం చేయొద్దని తనతో చెప్పినట్లు సాయి ధరంతేజ్ వెల్లడించారు. ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారానికి పవన్ మామ పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news