ఏపీలో దారుణం..20వ తేదీ కావస్తున్నా ఇంకా అందని పెన్షన్లు…!

-

విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ అందజేయడం అన్నది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, సామాజిక పింఛన్లు అందజేయడం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విధి మాత్రమేనని అన్నారు రఘురామకృష్ణ రాజు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ద్వారా లభించే ఆదాయాన్ని సామాజిక పింఛన్ల రూపములో పంచుకునే వెసులుబాటు ఉందని, అదే ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు తాము అందించిన సేవలకు గాను సకాలంలో తప్పనిసరిగా పెన్షన్లను అందజేయాలని అన్నారు.

విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లను 20వ తేదీ అయినప్పటికీ, 30 నుంచి 35 శాతం మందికి ఇంకా అందజేయకపోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. తొలుత పదవ తేదీ, ఆ తరువాత 15వ తేదీ, ఇప్పుడు 20వ తేదీ వచ్చినప్పటికీ, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడం లేదని, గత ప్రభుత్వ హయాంలో ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదని, సామాజిక పింఛన్లను ఒకటవ తేదీనే అందజేస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, విశ్రాంత ఉద్యోగులు కూడా 60 ఏళ్లు దాటిన వారేనని గుర్తించాలని, వారికి ఎన్నో ఖర్చులు ఉంటాయని తెలుసుకోవాలని అన్నారు. పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందజేయడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది అని స్పష్టమవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news