సాయిప‌ల్ల‌వికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ల‌క్ అంటే ఈమెదే!

-

తెలంగాణ యాస‌లో అచ్చుగుద్దిన‌ట్టు మాట్లాడి ఓ పిల్ల అంద‌రినీ ఫిదా చేసింది. స‌హ‌జ‌మైన యాక్టింగ్‌తో మ‌తి పోగొడుతోంది. ఇప్ప‌టికీ గ్లామ‌ర్ డోస్ ఇంత కూడా పెంచ‌కుండానే వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఏ హీరోయిన్ అయినా గ్లామ‌ర్ డోస్ పెంచ‌కుంటే స్టార్ హీరోయిన్ కాలేదు. ఆఫ‌ర్లు కూడా త‌గ్గిపోతాయి.

 

మ‌రి ఈమె కేంటి ఇలా ఆఫ‌ర్లు వ‌ర‌ద‌లా వ‌స్తున్నాయి. ఆమె ఎవ‌రా అనుకుంటున్నారా ఆమెనేనండి
నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు ఈమెకు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే తెలుగులో నాలుగైదు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది.

ఇప్పుడు మాస్ సినిమాల డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ క‌న్ను ఈమెపై ప‌డింది. ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తిని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్‌చేసుకుంటున్నాడు వినాయ‌క్‌. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌విని తీసుకోవాల‌ని చూస్తున్నాడంట‌. ఇందుకోసం ఆల్రెడీ ఆమెకు క‌థ కూడా వినిపించాడంట‌. అయితే ఇందులో కొన్ని మార్పులు చేసి తీయ‌నున్నారు. మ‌రి దీనికి ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కాకుంటే క‌ర్ణ‌న్ రీమేక్ తీసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట వినాయ‌క్‌.

Read more RELATED
Recommended to you

Latest news