Karthikeya2 : నేడే కార్తికేయ 2 ప్రీ రిలీజ్…గెస్ట్ గా మెగా హీరో

-

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలనే ఉన్నాయి. ఇప్పటికే కార్తికేయ సినిమాను చూసిన వారితో పాటు కార్తికేయ-2 టీజర్ చూసిన వాళ్లు సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా అని వెయిట్‌ చేస్తున్నారు. అయితే.. ద్వాపరయుగంతో .. ద్వారాకా నగరంతో ముడిపడిన కథ ఇది.

అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు. అయితే.. ఈ సినిమా ఈ నెల 13 వ తేదీన అంటే ఎల్లుండి రిలీజ్‌ కానున్న నేపథ్యంలో.. ఇవాళ ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగనుంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌ లో జరుగనున్న ఈ ఈవెంట్‌ కు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పెషల్‌ గెస్ట్‌ గా రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version