‘దేవర’ ని ఢీ కొట్టే ‘బైరా’ వచ్చేశాడు.. ఆసక్తికరంగా గ్లింప్స్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 27న  విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ , గ్లింప్స్ అన్నీ కూడా ఈ మూవీపై  భారీ అంచనాలను పెంచేసాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో గ్లింప్స్ విడుదలైంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భైర అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే  తాజాగా ఇవాళ  సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర గ్లింప్స్ విడుదల చేశారు.  ఈ  గ్లింప్ చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా భైర క్యారెక్టర్ లో సైఫ్ జీవించేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సైఫ్ పై ఫైట్ సీక్వెన్స్ కానీ బాక్గ్రౌండ్ లో సెటప్ అంతా చూస్తుంటే కొరటాల ఏదో కొత్త లోకమే సృష్టించాడనిపిస్తుంది. అదేవిధంగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో సైఫ్ కనిపిస్తుండగా.. తనపై వదిలిన గ్లింప్స్ లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version