ఆ మూడు సినిమాల త‌ర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి..!

సాయిప‌ల్ల‌వి కి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఆమె టాలీవుడ్‌కు వ‌చ్చి ఇప్ప‌టికే చాలా ఏళ్లు అవుతున్నా.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం న‌టించ‌లేదు. అలాగ‌ని అవ‌కాశాలు రాలేద‌ని కాదు. ఆమె త‌న పాత్ర‌కు మంచి స్కోప్ ఉంటేనే చేస్తాన‌ని తేల్చి చెబుతోంది. ఈ కార‌ణంగానే ఆమె చాలా సినిమాల‌ను రిజెక్ట్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఆమెకు ఆద‌ర‌ణ బాగా పెరిగింది. ఆమె త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో అంద‌రి హీరోయిన్ల‌కంటే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె త‌న నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే చేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమె పలు సినిమాల్లో చేస్తోంది.

ప్ర‌స్తుతం లవ్ స్టోరీతో పాటు విరాట పర్వం మూవీలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అలాగే నానితో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా చివరి షెడ్యూల్ మాత్ర‌మే ఉంది. ఇక ఈ మూడు కూడా క‌రోనా త‌ర్వాత థియేటర్లలో వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఇవి గ‌న‌క ఒకేసారి విడుద‌లై విజ‌యం సాధిస్తే ఇక సాయిప‌ల్ల‌వికి తిరుగే ఉండ‌దు. ఈ మూడు సినిమాల్లో ఆమె పాత్ర‌లు మ‌రో లెవ‌ల్‌లో ఉంటాయ‌ని ఇప్ప‌టికే వ‌చ్చిన టీజ‌ర్ల ద్వారా తెలుస్తోంది. కాబ‌ట్టి ఈ సినిమాలు ఆమె రేంజ్ ను మరింతగా పెంచడం ఖాయం.