వైరస్ యొక్క జన్యు పర్యవేక్షణ కోసం కన్సార్టియం..!

-

SARS-CoV-2, కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్. అయితే ఇలాంటి వైరస్ లాంటివి ఏర్పడకముందే ఎలా ప్రభావితం చేస్తుంది..?, ఎలా పని చేస్తుంది అనే వాటిని ఐడెంటిఫై చేయాలని వీళ్ళ ముఖ్య ఉద్దేశం అని ఎక్స్పర్ట్ అంటున్నారు. వైరస్ ఎటువంటి వేరియంట్స్ లోకి మారుతుంది అనేది ముందుగానే కనుక్కోవాలని వాళ్లు దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

కన్సార్టియం తీవ్రమైన పర్యావరణ పర్యవేక్షణ మరియు అధునాతన గణన పద్ధతులతో కలిసి, కనుక్కోనుంది. ఎపిడెమియాలజీ కోసం సామర్థ్యాలను పెంపొందించడంపై కూడా శ్రద్ధ పెడుతున్నట్టు చెప్పింది.

రాక్ఫెల్లర్ ఫౌండేషన్ యొక్క మద్దతు మరియు విత్తన నిధులతో ఈ కన్సార్టియం ని ప్రారంభించారు. హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) నేతృత్వం వహిస్తుంది.

మరో మూడు నగరాల్లో వేరు వేరు పార్ట్నర్స్ ని ఇది కలిగి ఉంది. బెంగళూరులోని ఎన్‌సిబిఎస్-టిఫ్ఆర్, ఇన్‌స్టెమ్-డిబిటి మరియు నిమ్‌హాన్స్, న్యూ ఢిల్లీలో CSIR-IGIB , పూణేలోని నాలెడ్జ్ క్లస్టర్, సిఎస్ఐఆర్-ఎన్‌సిఎల్ మరియు ఐఐఎస్ఇఆర్. అక్కడ వుండే ఆసుపత్రులతో వైద్యులతో ఇది వర్క్ చేస్తుంది.

ఇది ఇలా ఉంటే సిఎస్‌ఐఆర్-సిసిఎంబి సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా ఈ ప్రయత్నాలకు లీడర్ షిప్ వహిస్తారు, ప్రొఫెసర్ సత్యజిత్ మేయర్, ఎన్‌సిబిఎస్; ప్రొఫెసర్ ఎల్ ఎస్ శశిధర, పూణే నాలెడ్జ్ క్లస్టర్; మరియు డాక్టర్ అనురాగ్ అగర్వాల్, CSIR-IGIB.

ఈ వేరియంట్స్ ని గుర్తించడానికి వాటి గురించి కనిపెట్టడం మా లక్ష్యం అని వాళ్ళు తెలిపారు. ఇది క్లినికల్ లక్షణాలు మరియు వ్యాధి తీవ్రతతో పరస్పర సంబంధం కలిగి ఉండటానికి సహాయ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news