పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1’తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నారు. డిసెంబర్ 22న రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా థియేటర్లలో హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఊచకోత కోస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్లు కురిపించడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు విపరీతంగా ఫిదా అవుతున్నారు. రాధేశ్యామ్, అదిపురుష్ వంటి డిజాస్టర్ల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది.
ఇక లాంగ్ వీకెండ్ కావడం వల్ల మూడు, నాలుగు రోజుల్లో కూడా కాసుల సునామీ కురిపించింది సలార్. దేశవ్యాప్తంగా ఈ సినిమా నాలుగో రోజు రూ.42.50 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ చిత్రం తొలి రోజు- 90.70 కోట్లు, రెండో రోజు- 56.35 కోట్లు, మూడో రోజు- 62.05 కోట్లు. నాలుగో రోజు- 42.50 కోట్లు వసూల్ చేసింది. ఈ లెక్కన నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా సలార్ రూ.250 కోట్ల మార్క్ అందుకున్నట్లు సమాచారం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ నాలుగు రోజుల్లో ఈజీగా రూ.500కోట్ల మార్క్ అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.