గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సలార్’

-

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ లేటెస్ట్గా నటించిన సినిమా సలార్ పార్ట్1 సీజ్ ఫైర్. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ గతేడాది డిసెంబర్ 22వ తేదీ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే గాకుండా బాక్సాఫీస్ వద్ద కలెెక్షన్ల ఊచకోత కోసింది. ఇప్పటి వరకు సలార్ రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎంతో కాలం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఓటీటీ రిలీజ్ కోసం మాత్రం ఎక్కువగా కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విడుదలైన నెలరోజులకే అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఓటీటీ వేదికగా సందడి చేయనుంది.

జనవరి 20 (శనివారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సలార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ముందుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. హిందీలో స్ట్రీమింగ్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని టాక్. థియేటర్లలో రికార్డులు సృష్టించిన సలార్, ఓటీటీలోనూ అదే రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version