యాంటీబయాటిక్‌ ఎందుకిస్తున్నారో ప్రిస్క్రిప్షన్లో రాయండి : కేంద్రం

-

అనారోగ్య బాధితులకు యాంటీ బయాటిక్‌ ఔషధాలను సిఫార్సు చేేసే విషయంలో వైద్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మందులను రోగులకు సిఫార్స్ చేసేటప్పుడు కచ్చితంగా అందుకు కారణాలను మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్)లో తప్పనిసరిగా తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యులకు సూచించింది. మరోవైపు అర్హులైన డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే యాంటీ బయాటిక్‌లను విక్రయించాలని ఫార్మాసిస్టులకు విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ అతుల్‌ గోయెల్‌ దేశవ్యాప్తంగా అన్ని వైద్యసంఘాలకు, ఫార్మసిస్టు సంఘాలకు తాజాగా ఓ లేఖ రాశారు. యాంటీ బయాటిక్‌ ఔషధాల వినియోగంపై ఆ లేఖలో కీలక మార్గదర్శకాలను పేర్కొన్నారు, ఈ మందుల వాడకం అధికమైతే రోగుల్లో నిరోధకత పెరిగి భవిష్యత్తులో తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయని లేఖలో తెలిపారు. ఈ క్రమంలోనే దీన్ని అరికట్టేందుకు ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నేరుగా యాంటీ బయాటిక్‌ ఔషధాలను విక్రయించకూడదని ఫార్మసిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు డాక్టర్ అతుల్ గోయెల్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version