సల్మాన్ ఖాన్ ఇంట్లో విషాదం..!

-

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతని మేనల్లుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ అనారోగ్యంతో మరణించాడు. గత కొన్ని రోజులుగా అతను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 38 ఏళ్ళ అబ్దుల్లా ఖాన్ మరణంతో ఒక్కసారిగా సల్మాన్ కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. మేము నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. అబ్దుల్లా మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సల్మాన్ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నామని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

అబ్దుల్లా ఖాన్ స్వతహాగా బాడి బిల్డర్… సల్మాన్ తో జిమ్ చేసే వీడియో లు కూడా బయటకు వచ్చాయి. చాలా సార్లు అతనితో వేదిక మీద కూడా కనిపించాడు. జిమ్‌ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్‌ గతంలో అనేకసార్లు సోషల్‌మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news