తెలుగు రాష్ట్రాల్లో సగం కరోనా కేసులు అక్కడ్నుంచే

-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 12 మందికి కరోనా పాజిటివ్ రావడానికి కారణాలను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వల్ల జరిగిన 6 మరణాలకు అదే కారణంగా నిర్దారించింది. ఈ నెల రెండో వారంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మార్కాజ్ మందిరంలో ప్రార్థనలు హాజరైన వారి నుంచే ఈ వ్యాది ఎక్కువగా సోకిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది ఆ రోజు ప్రార్థనలకు హాజరైనట్టు వివరించారు.

అయితే వీరిని కనుక్కునేందుకు 30 ప్రత్యేక బృందాలను నియమించినట్టు వివరించింది. ఢిల్లీ లో ప్రార్థనలకు వెళ్లొచ్చినా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఢిల్లీ మర్కాజ్ విషయం బయటపడగానే ఉలిక్కిపడ్డారు. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఎంతమంది వచ్చారనే విసయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ నుంచి 300 మంది ఏపీ నుంచి 500 మంది మర్కజ్ వెళ్లొచ్చిన  అంచనా వేశారు. ఎక్కువ మంది ఒకే ట్రైన్లో వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరణించిన ఆరుగురు ఢిల్లీ నుంచి వచ్చినవారే..

ఏపీలో అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ప.గో, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళంకు చెందిన వారున్నారు. కేవలం ప్రకాశం జిల్లాకు చెందినవారే 103 మంది. మొత్తం 200 మంది నమూనాలు టెస్ట్ చేసి ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మిగతా 300 మందిని గుర్తించేందుకు అధికారులు కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news