యూటర్న్ ట్రైలర్.. సస్పెన్స్ అదిరింది..!

-

సమంత లీడ్ రోల్ లో ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ నటిస్తున్న సినిమా యూటర్న్. పవన్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా మర్డర్ మిస్టరీతో వస్తున్న ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారని చెప్పొచ్చు. ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది.

సమంత ఏరికోరి ఈ సినిమా రీమేక్ కు ఎందుకు పట్టుబట్టింది అన్నది ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సినిమా మొత్తం సమంత చుట్టే తిరుగుతుంది. సినిమాలో భూమిక కూడా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అక్కడ హిట్ అయ్యింది కాబట్టి తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మాత్రం తెలుగులో మరో సస్పెన్ థ్రిల్లర్ మూవీని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. సమంత మంచి ఫాంలో ఉంది కాబట్టి ఈ సినిమా కూడా ఆమెకు మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version