చైతుపై సమంత అరచిన సందర్భం అదే..!

104

నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి చేసిన ఏమాయ చేసావె సినిమా మ్యాజిక్ నే రీసెంట్ గా వచ్చిన మజిలీ కూడా రిపీట్ చేసింది. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా చైతు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్న మజిలీ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమా టైంలో సమంత తన భర్తపై అరచిన సందర్భాలు ఉన్నాయట.

పూర్ణ పాత్రలో చైతు కొన్ని సీన్స్ లో అనుకున్నట్టుగా నటించకపోతే అరిచేదాన్ని అని చెప్పింది సమంత. ఆశించిన స్థాయిలో చైతు నటన లేకుంటే బాధనిపించేదని అంది. నాతో పాటుగా నా భర్త గురించి ఆలోచించడం నా బాధ్యత అందుకే అలా చేస్తానని అన్నది. ఇక ఒకరి సినిమాల గురించి మరొకరం చర్చిస్తామని.. చైతు నటన బాగుంటే సంతోషంగా ఫీల్ అవుతా బాగాలేకపోతే అరిచేస్తా అని అంటుంది. మొత్తానికి ‘బెటర్‌హాఫ్‌’ అనే పదానికి సరైన అర్థం సమంత అని సినీలోకం కితాబిస్తోంది.