భారత్ టిక్ టాక్ యూజర్లకు షాక్.. యాప్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం

51

సాధారణంగా ఫన్నీ వీడియోలు, ఇతర వీడియోలు షేర్ చేస్తే సమస్యేం లేదు కానీ.. పోర్న్ కంటెంట్, అడల్డ్ కంటెంట్ షేర్ అయితే ఎలా? అది యూత్ ను తప్పుదారి పట్టిస్తుంది కదా.

టిక్ టాక్ యాప్. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. చైనాకు చెందిన ఈ యాప్ భారత్ లో ఎంతో ఫేమస్. ఎక్కువగా పిల్లలు, విద్యార్థులు, యూత్.. ఈ యాప్ కు బానిసయ్యారు. 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను ఈ యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఆ వీడియోను నచ్చిన వాళ్లు దాన్ని లైక్ చేయడం, షేర్లు చేయడం చేస్తుంటారు. అలా యాప్ లో ఫాలోవర్లను పెంచుకొని కొత్త కొత్త వీడియోలను అప్ లోడ్ చేస్తూ టైమ్ పాస్ చేయడమే టిక్ టాక్ యాప్.

union IT ministry directed google and apple to remove tik tok app from their playstores

అయితే.. సాధారణంగా ఫన్నీ వీడియోలు, ఇతర వీడియోలు షేర్ చేస్తే సమస్యేం లేదు కానీ.. పోర్న్ కంటెంట్, అడల్డ్ కంటెంట్ షేర్ అయితే ఎలా? అది యూత్ ను తప్పుదారి పట్టిస్తుంది కదా. ఆ కంటెంట్ ను పిల్లలు చెడిపోతారని మద్రాస్ హైకోర్టు ఇదివరకే టిక్ టాక్ యాప్ ను భారత్ లో బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించింది. అయితే.. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో టిక్ టాక్ యాజమాన్యం పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం… మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో టిక్ టాక్ యాప్ ను ఆయా స్టోర్ల నుంచి తీసేయాలని గూగుల్, యాపిల్ కంపెనీలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.