తారక్ కు థ్యాంక్స్.. కెరియర్ ట్రాక్ ఎక్కించారు..!

186

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర హీరోగా సినిమాలు చేస్తున్నా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. హీరోగా చేస్తూనే నాని నేను లోకల్ లో సపోర్టింగ్ రోల్ చేసిన నవీన్ చంద్ర లాస్ట్ ఇయర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో విలన్ గా చేశాడు. ఆ సినిమాలో నవీన్ చంద్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక లేటెస్ట్ గా నవీన్ చంద్ర హీరోగా మరో సినిమా వస్తుంది.

ఆ సినిమా ఈవెంట్ లో తన కెరియర్ మళ్లీ ట్రాక్ ఎక్కించింది అరవింద సమేత. ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు ఎన్.టి.ఆర్, త్రివిక్రంలకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు నవీన్ చంద్ర. ఇక తను హీరోగా చేస్తున్న ఈ సినిమాను వేణు మధుకంటే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుందని.. ఈ కథతో దర్శకుడితో పాటుగా తాను వన్ ఇయర్ ట్రావెల్ చేశానని. త్వరలోనే సినిమా టైటిల్ ప్రకటిస్తామని అన్నారు నవీన్ చంద్ర.