అమ్మఒడి నాన్నబుడ్డిగా మారింది – చంద్రబాబు

-

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. నేడు మంగళగిరి పార్టీ ఆఫీసులో దళిత వర్గాలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ నిధులను వైసిపి పక్కదారి పట్టించి దళితులను మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. అమ్మఒడి నాన్నబుడ్డిగా మారిందని ఎద్దేవా చేశారు. ఎస్సీలకు టిడిపి చేసిన మంచి పనులు ఎవరూ చేయలేదన్నారు చంద్రబాబు. ఎస్సీ విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు ప్రత్యేక గురుకులాలను టిడిపి హయాంలో ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి వచ్చాక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version