Samantha : ఉక్రెయిన్ అధ్యక్షుడుపై “సమంత” సంచలన వ్యాఖ్యలు

-

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. యుద్ధం వద్ద‌ని ప‌లు దేశాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ర‌ష్యా కోరినా.. వాటిని బేఖాత‌రు చేస్తు ఉక్రెయిన్ పై యుద్ధం ప్ర‌క‌టించింది. దీంతో ఇప్ప‌టికే చాలా దేశాలు ర‌ష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. అయితే.. తాజాగా రష్యా- ఉక్రెయిన్‌ యుద్దంపై టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత సంచలన పోస్టు చేసింది.

ఉక్రెయిన్‌ లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవ జాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌ లోకి తీసుకెళుతున్న ఓ వీడియోను తన ఇన్‌ స్టా గ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది సామ్‌. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేసింది.

అంతేకాదు.. యోధుడైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కే చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్య సాహసాలే అందుకు సాక్ష్యమని.. పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ ను కూడా షేర్‌ చేసింది సామ్‌. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పరిస్థితులపై ఎంతో మంది సెలబ్రీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సమంత.. ఇలా స్పందించింది. కాగా.. ప్రస్తుతం సమంత యశోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version