కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఆయన ఫ్యాన్స్ కే కాకుండా.. యావత్ కన్నడ ప్రజలకు తీరని శోఖాన్ని మిగిల్చింది. తను చేసిన సామాజిక సేవలు, చిత్ర రంగానికి చేసిన సేవలను తలుచుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే తాజాగా పునీర్ రాజ్ కుమార్ పేరుతో నింగిలోకి ఓ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో సహకారంలో శాటిలైట్ ను ప్రయోగించనున్నారు. ఈ శాటిలైట్ ను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించడం విశేషం. భారత దేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ ఉపగ్రహాన్ని తయారుచేస్తున్నారు. కర్ణాటకలోని 20 ప్రభుత్వ స్కూళ్లు ఈ అవకాశాన్ని దక్కించుకున్నాయి.
20 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులతో ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది. జాతీయ సైన్స్ దినం సందర్భంగా బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వథ్ నారాయణ ఈ విషయం వెల్లడించారు. ఇందుకోసం రూ. 1.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. సాధారణంగా 60 కిలోలల ఉపగ్రహానికి రూ. 50-60 కోట్లు ఖర్చు అవుతుంది. .. కానీ మేం కిలోన్నర ఉపగ్రహాన్ని తయారు చేయిస్తున్నామని… పిల్లలకు పునీత్ అంటే చాలా అభిమానం అని.. అందుకే ఈ శాటిలైట్కు ఆయన పేరు పెడుతున్నామని మంత్రి వెల్లడించారు.