Samantha: మాజీ భర్తపై సమంత పరోక్ష వ్యాఖ్యలు..అలా చేయొద్దని అభిమానులకు హితవు

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. వరుస సినిమాలు చేస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్సే కాదు..హాలీవుడ్ సినిమాలు చేస్తోంది. తాజాగా ‘శాకుంతలం’ డబ్బింగ్ కంప్లీట్ చేసింది. త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చింది. టాకీసులో చూసిన తొలి సినిమా జురాసిక్‌ పార్క్‌ అని పేర్కొన్న సామ్..తన ఫస్ట్ ఇన్ కమ్ గురించి వివరించింది. హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు రూ.500 ఇచ్చారని గుర్తుచేసుకుంది. యువతకు ముఖ్యంగా అమ్మాయిలకు తానిచ్చే మెసేజ్ నమ్మకం పెట్టుకోవాలని, కలల సాకారం దిశగా ప్రయత్నించాలని చెప్పింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సమంతను టాటూల గురించి అడిగాడు. పచ్చబొట్టు గురించి ప్రశ్న రాగానే సమంత ఆలోచనలో పడిపోయింది. కానీ, సమాధానం అయితే ఇచ్చింది. మీరు ఎప్పటికైనా టాటూలు వేసుకుంటారా? అని అడగగా, తాను అసలు టాటూలు వేయించుకోకూడదని అనుకున్నానని అంది.

అటువంటి థాట్ ఉంటే మానుకోవాలని అభిమానులు, నెటిజన్లకూ సూచించింది. సమంత గతంలో తన నడుము పై భాగంలో నాగచైతన్య పేరిట టాటూ వేసుకున్న సంగతి తెలిసిందే. అలా తన మాజీ భర్త కోసం చేసిన పనిని గురించి సమంత పరోక్షంగా ప్రస్తావించినట్లయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version