హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సామ్ … సైక్లింగ్ ఫోటోలు వైరల్ !

-

మలయాళం నుండి వచ్చి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన సమంత కెరీర్ లో ఆ తర్వాత జెట్ స్పీడ్ లో దూసుకుపోయినా, పర్సనల్ లైఫ్ లో మాత్రం ఢీలా పడింది అని చెప్పాలి. ప్రస్తుతం నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన ఖుషి సినిమా సక్సెస్ కావడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ప్రస్తుతం హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆరోగ్య సమస్యల వలన కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా వినికిడి. ప్రస్తుతానికి సిటాడెల్ తర్వాత మరే చిత్రం షూటింగ్ లోనూ పాల్గొన్నది లేదు. కాగా తాజాగా ఈమె ఆస్ట్రియా లో సైక్లింగ్ చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

ఆరంజ్ కలర్ ప్యాంటు, గ్రే ట్ షర్ట్ మరియు కాప్ వేసుకుని సైక్లింగ్ చేస్తోంది సమంత. ఈ ట్రిప్ తర్వాత తాను ఏమైనా కొత్త ప్రాజెక్టు లకు సైన్ చేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news